కాకినాడలో దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా : కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధారాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కంపర రమేష్ తొమ్మిదో వార్డు కార్పొరేటర్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం చైర్మన్‌గా పనిచేశారు. ఇదివరకు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1992లో ఎన్‌ఎస్‌యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా, 1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునిగా పని చేశారు. 2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

అయితే గురువారం అర్దరాత్రి కాకినాడ రూరల్ గంగరాజునగర్ రోడ్డు నంబరు 9 వద్దా ఉన్నా సూర్య వాటర్ సర్వీసింగ్ సెంటర్​ వద్దా ముత్యాల సతీష్, సుందరివీడు వాసుతో రమేష్ మద్యం పార్టీ చేసుకున్నాడు. అయితే రమేష్​కి కాకినాడ ఎండోమెంట్ కాలనీకి చెందిన గురజాల చిన్నపలు మార్లు ఫోన్ చేశారు. దీంతో రమేష్ ఫోన్​ లిఫ్ట్ చేసి మద్యం పార్టీ కీ పిలవడం తో గురజాడ చిన్నమరియు అతని సోదరుడు గురజాడ కుమార్ పార్టీ కీ వచ్చారు. పార్టీ తరువాత రమేష్ ను గురజాడ చిన్ని తన ఇంటిలో పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయి రావాలని కోరారు. దీనికి రమేష్ రావడం కుదరదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన గురజాడ చిన్న రమేష్​ను పలు మార్లు కారుతో గుద్ది అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్నా రమేష్​ను ట్రస్టు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్​ మృతిచెందాడు. రమేశ్​ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సీఐ నున్న రాజు వివరించారు.