ముగిసిన ఎన్ఆర్ఐ శ్వేత అంత్యక్రియలు

ముగిసిన ఎన్ఆర్ఐ శ్వేత అంత్యక్రియలు

-ఎంపీ రవిచంద్ర సాయంతో హనుమకొండకు చేరిన శ్వేత పార్థివదేహం

ముగిసిన ఎన్ఆర్ఐ శ్వేత అంత్యక్రియలువరంగల్ టైమ్స్, హన్మకొండ జిల్లా : వికాస్ నగర్ నివాసి, ఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే.లక్మారెడ్డి-వెంకటలక్మీ దంపతుల కుమార్తె శ్వేత ఇటీవల అమెరికాలో అకాల మరణం చెందారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె ఆ తర్వాత భర్త సురేష్ రెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, శ్వేత గుండెపోటుకు గురై ఈనెల 8న అకాల మృత్యువునకు లోనయ్యారు. ఆమె పార్థివదేహాన్ని సొంతగడ్డకు రప్పించేందుకు గాను వారి సమీప బంధువు కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సహాయాన్ని కోరారు.ఆ సమయాన పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీ రవిచంద్ర వెంటనే స్పందించి విషయాన్ని హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి అమెరికాలోని భారత రాయబారి కార్యాలయ అధికారులను ఆదేశించడంతో శ్వేత మృతదేహం హనుమకొండ ఏన్జీవో కాలనీ రోడ్డులో ఉన్న నివాసానికి చేరింది,ఆమె అంతిమ సంస్కారం పద్మాక్షిగుట్ట సమీపాన ఉన్న శ్మశాన వాటికలో బుధవారం మధ్యాహ్నం జరిగింది.