‘హిట్ 2’ గ్లింప్స్ రిలీజ్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

‘హిట్ 2’ గ్లింప్స్ రిలీజ్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని
హైదరాబాద్ : ‘క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు’ వంటి వైవిధ్య‌మై క‌థా చిత్రాల్లో హీరోగా న‌టించిన త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న క‌థానాయ‌కుడు అడివి శేష్‌. ఈ వెర్స‌టైల్ హీరో  ఇప్పుడు దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ ‘మేజ‌ర్‌’తో పాటు సీట్ ఎడ్జ్ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2’తోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. ‘హిట్ 2’ను హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు.
శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 17) అడివి శేష్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను హీరో, చిత్ర స‌మ‌ర్ప‌కుడు నేచుర‌ల్ స్టార్‌ నాని విడుద‌ల చేశారు. ఇందులో అడివి శేష్ ఇందులో ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డిగా మెప్పించ‌నున్నారు.
గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో అడివి శేష్ ఏదో కేస్‌ను చేధించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను చేయ‌డం.. ఏదో అన్వేషిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. త‌న లుక్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉంది. త‌న‌తో పాటు ఓ పోలీస్ డాగ్ ఉండ‌టాన్ని ఈ గ్లింప్స్‌లో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే విల‌న్స్‌ను భ‌ర‌తం ప‌ట్టే పోలీస్ ఆఫీస‌ర్‌గానూ అడివి శేష్‌ను మ‌నం చూడొచ్చు. ఏదో కేసు గురించి త‌ను చాలా సీరియ‌స్‌గానూ ఆలోచిస్తున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది.
ఇదే బ్యాన‌ర్‌లో రూపొంది ఘన విజయం సాధించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్  ‘హిట్‌’ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందుతోన్న చిత్రమే ‘హిట్ ‌2’. ‘ది సెకండ్‌ కేస్‌’ సినిమా ట్యాగ్‌లైన్‌. హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే ‘హిట్ 2’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ చిత్రంలో హీరో చాలా సీరియస్‌గా కనిపిస్తే… ఇందులో మాత్రం అడివి శేష్ చాలా బ్రీజీ లుక్‌లో ఉండ‌టాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా చిత్రీక‌ర‌ణ 90 శాతం పూర్త‌య్యింది.
మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి నేప‌థ్య‌ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు
సాంకేతిక వర్గం: 
సమర్పణ:  నాని
బ్యానర్‌:  వాల్‌పోస్టర్‌ సినిమా
నిర్మాత:  ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను
సినిమాటోగ్రఫీ:  మణికందన్‌
నేప‌థ్య సంగీతం: జాన్‌ స్టీవర్స్‌ ఎడురి
ఆర్ట్‌:  మనీషా ఎ.దత్‌
ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్ రత్నం(వెంకట్‌)