పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు

పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపువరంగల్ టైమ్స్, ఇంటర్ నెట్ డెస్క్: చెన్నై-గూడూరు సెక్షన్‌లో సాంకేతిక పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 12711-12712 విజయవాడ-చెన్నైసెంట్రల్‌ రైలు గూడూరు-చెన్నై మధ్య ఫిబ్రవరి 22న రద్దు చేయనున్నారు. రైలు నెంబరు 06746-06745 నెల్లూరు-సూళ్లూరుపేట మెము రైలును ఫిబ్రవరి 22న పూర్తిగా రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైలు నెంబరు 22403 పుదుచ్చేరి-న్యూఢిల్లీ రైలు ఈ నెల 16న చెంగలపట్టు, పెరంబూర్‌ మీదగా దారి మళ్లింపు చేయనున్నట్లు తెలిపారు. రైలు నెంబరు 22645 ఇండోర్‌-కొచివెల్లి రైలు ఈ నెల 21న గూడూరు, రేణిగుంట మీదుగా దారి మళ్లింపు , రైలు నెంబరు 13351 దన్‌బాద్‌-అలెప్పి ఈ నెల 21న గుంటూరు-రేణిగుంట మీదుగా దారి మళ్లింపు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.