టీ హైకోర్టుకు మరో 12 మంది న్యాయమూర్తులు!

టీ హైకోర్టుకు మరో 12 మంది న్యాయమూర్తులు!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మంగళవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం, 12 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో ఐదుగురు జ్యుడీషియరీ నుంచి ఉండగా, ఏడుగురు న్యాయవాదులు ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 19 మంది న్యాయమూర్తులున్నారు. కొత్తవారితో ఆ సంఖ్య 31 కి చేరుతుంది.టీ హైకోర్టుకు మరో 12 మంది న్యాయమూర్తులు!ఏడుగురు న్యాయవాదులు, ఆరుగురు న్యాయాధికారుల పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఒక న్యాయాధికారి మినహా మిగిలినవారందరినీ కొలీజియం ఆమోదించింది. కాగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. కొత్తగా నియమితులయ్యే వారిలో నలుగురు మహిళా జడ్జీలు ఉన్నారు. మొత్తం 31 మందిలో 10 మంది, అంటే మూడో వంతు న్యాయమూర్తులుగా మహిళలు ఉంటారు. ఇది హైకోర్టుల చరిత్రలోనే అరుదు. ఏ హైకోర్టులోనూ ఈ స్థాయిలో మహిళలు న్యాయమూర్తులుగా లేరు.