వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా

వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లావరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న పరకాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మేడారం జాతర పూజారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు ప్రత్యేక పూజలు చేశారు. పట్టు కండువాలతో చల్లా ధర్మారెడ్డితో పాటు, ఆయన కుటుంబసభ్యులను సత్కరించారు. సమ్మక్క, సారలమ్మలకు పసుపు, బంగారం సమర్పించుకుని ఎమ్మెల్యే చల్లా కుటుంబసభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే భక్తులను కోరారు.వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా