ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇవి తినకండి !

ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇవి తినకండి !

ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇవి తినకండి !వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కనీసం 7 గంటల నిద్ర చాలా ముఖ్యం. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. తక్కువ నిద్ర అనేది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి నిద్రలేమికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో మొబైల్ వాడకం ప్రధానమైనది. అంతే కాకుండా నిద్రపోయే ముందు టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల కూడా నిద్ర పట్టదు. మీరు కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే వీటిని దూరంగా ఉండాలి. అవేంటో ఓసారి చూద్దాం.

– రాత్రిపూట టమాటా తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆమ్లాన్ని ఆక్సాలిక్ ఆమ్లం అంటారు. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.

– ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రిపూట ఐస్‌క్రీం తినకూడదు. దీని వినియోగం వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల రాత్రి నిద్ర, ప్రశాంతత రెండూ కరవవుతాయి.

– వెన్న లేదా చీజ్ రాత్రిపూట తినకూడదు. దీని వినియోగం రాత్రి నిద్రలో ఆటంకాలు కలిగిస్తుంది. మీరు పగటిపూట మాత్రమే వెన్న తీసుకోవాలి.

– రాత్రి పడుకునేటప్పుడు సిట్రస్ పండ్లను కూడా తినకూడదు. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రలేని రాత్రులను కలిగిస్తుంది. అలాగే కెచప్, ఫ్రైస్ కూడా తినకూడదు.

– రాత్రి పడుకునేటప్పుడు కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు కాఫీకి దూరంగా ఉండండి. కాఫీ తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది.

– రాత్రి వేళల్లో వేయించిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అయితే ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నూనెలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి.

– రాత్రి పూట పిజ్జా తినడం మానుకోండి. పిజ్జా వెన్న, టమోటాతో తయారు చేస్తారు. ఇందులో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రలేని రాత్రులకు కారణం అవుతుంది. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కూడా రాత్రి పడుకునే సమయంలో తినకూడదు.