సారంగ‎దరియా కోమలితో ప్రత్యేక ఇంటర్వ్యూ

సారంగ‎దరియా కోమలితో ప్రత్యేక ఇంటర్వ్యూ

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఆమెకు జానపద పాటలంటే చాలా ఇష్టం. ఆరేళ్ల వయస్సు నుంచే జానపద పాటలు పాడుతూ అందరి మనసులు దోచేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం ‘ సారంగ‎దరియా ‘ అనే పాటతో టీవీల్లో ఆమె పాటను మార్మోగించింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజతో పాటు పలువురి ప్రశంసలు పొందింది. సారంగ దరియా జనం పాట అయినా తానే వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే జానపద పాటలే ప్రాణంగా పెట్టుకున్న ఆ యువతి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ‘ లవ్ స్టోరి ‘ సినిమాలో రిలీజ్ అయిన సారంగ దరియా పాటపై నెలకొన్న వివాదంలో ఆమె పోరాటం చేస్తుంది. చివరికి సారంగదరియా పాట తనదే అంటూ చేసిన పోరాటంలో ఫలితం దక్కినప్పటికీ, తగిన గుర్తింపు లభించాలని డిమాండ్ చేస్తున్న వరంగల్ ఆడపడుచు తొట్టె కోమల అలియాస్ సారంగదరియా కోమలితో వరంగల్ టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం..