కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: వైద్యులు

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: వైద్యులు

వరంగల్ టైమ్స్ ‎‎హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని యశోద హస్పటల్ డాకర్ట్ లు ఫిజిషీయన్ ఎంవీరావు, కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. పలురకాల వైద్య పరిక్షల అనంతరం సర్వైకల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామని వైద్యులు తెలిపారు. సీఎం కు వైద్య పరిక్షల అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: వైద్యులుసర్వైకల్ స్పైన్ లో కొంచం స్పాండిలోసిస్ ఉంది. ఇది వయసుతో పాటు వస్తుందని అన్నారు. ప్రస్తుతం బీపీ,షుగర్ కంట్రోల్ లో ఉందని కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదన్నారు వైద్యులు. సాయంత్రం 4 గటంలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు.