సాధారణ ప్రయాణికుడిలా బస్సెక్కిన సజ్జనార్

సాధారణ ప్రయాణికుడిలా బస్సెక్కిన సజ్జనార్హైదరాబాద్ : ప్రజా రవాణా సంస్థను గట్టెక్కించేందుకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)సజ్జనార్ రంగంలోకి దిగారు. సాధారణ ప్రయాణికుడిలా సిటీబస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో మాట్లాడారు.

ఎంజీబీఎస్ లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. పాడైపోయిన వాహనాలను స్క్రాప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. సంస్థ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు.