నీలం సంజీవరెడ్డి మనవడికి బీఆర్ఎస్ పెద్దపీట !

నీలం సంజీవరెడ్డి మనవడికి బీఆర్ఎస్ పెద్దపీట !

నీలం సంజీవరెడ్డి మనవడికి బీఆర్ఎస్ పెద్దపీట !

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓ శిఖరం. అలాంటి శిఖరసమానుడి మనవడే చల్లా వెంకట్రామిరెడ్డి. అంటే నీలం సంజీవరెడ్డి కుమార్తె కుమారుడే వెంకట్రామిరెడ్డి. ఈ కుటుంబానికి జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలపై గట్టి పట్టుంది. పార్టీలకతీతంగా అభిమానించే వాళ్లున్నారు. ఆ అభిమానం వల్లే ఆయన 2004లో అలంపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి సత్తా చాటారు. గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కానీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీగా మారడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీగూటికి చేరారు. సీఎం కేసీఆర్ అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. అందువల్లే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారని టాక్.

* అలంపూర్ పై చల్లాకు గట్టి పట్టు
నిజానికి చల్లా వెంకట్రామిరెడ్డి కుటుంబానికి జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలపై మంచి పట్టుంది. అలంపూర్ నియోజకవర్గంతో పాటు గద్వాల, వనపర్తిలోని కొన్ని ప్రాంతాలపై చల్లా కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ గెలుపోటములను శాసించేంత బలం ఈ కుటుంబానికి ఉంది. ముఖ్యంగా అలంపూర్ లో చల్లా వెంకట్రామిరెడ్డి ఎటు వైపు మొగ్గితే జనం కూడా ఆ వైపే మొగ్గు చూపుతారన్న వాదన ఉంది. అందుకే పాలమూరు జిల్లాకు చెందిన చాలామంది నేతలకు చల్లా వెంకట్రామిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీలకతీతంగా నేతలంతా ఆయనను అభిమానిస్తారు.నీలం సంజీవరెడ్డి మనవడికి బీఆర్ఎస్ పెద్దపీట !* కేసీఆర్ ఫోకస్ పెట్టారంటే చల్లా గట్టెక్కినట్లే !
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు చల్లా కుటుంబ బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా తెలుసట. అంతేకాదు పాలమూరు జిల్లాలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి ఉద్దండులు గులాబీ జెండాతో సై అంటే సై అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ ముఖ్యనేతలకు బ్రేకులేసేందుకు అదే సామాజికవర్గానికి చెందిన చల్లాపై సీఎం కేసీఆర్ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

* చల్లాకు ఎమ్మెల్సీ ఆఫర్
చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు గులాబీపార్టీ పక్కా స్కెచ్చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో తగిన లబ్ధి పొందవచ్చన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నేతలు కూడా చల్లాకు ప్రాధాన్యత ఇస్తే మంచి లాభం ఉంటుందని సూచించారట. ఈ వాదనతో సీఎం కేసీఆర్ కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చల్లాకు కేసీఆర్ టీమ్ నుంచి ఫోన్ వెళ్లినట్లు టాక్. అన్నీ మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్సీపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

* ఒక్కసారిగా యాక్టివ్ అయిన చల్లా అనుచరులు
నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ లో అంత యాక్టివ్ గా లేని ఆయన అనుచరులు చల్లా వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగానే ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారట. ఎన్నికల్లో చల్లా ఎవరికి చెబితే వాళ్లకే పనిచేస్తామని చెబుతున్నారట. అలా చల్లా వెంకట్రామిరెడ్డి పేరు మరోసారి హైలైట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు అయితే చల్లాకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు టాక్. చల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తే ఇక తమ విజయానికి ఢోకా ఉందని వారి ఆలోచన. మరి నిజంగానే చల్లా వెంకట్రామిరెడ్డి సేవలను బీఆర్ఎస్ ఏ మేరకు వాడుకుంటుంది? ఆయన బీఆర్ఎస్ కు ఎంతమేరకు కలిసి వస్తారో? చూడాలి.