టీ 20లోనూ టీమిండియాదే గెలుపు

టీ 20లోనూ టీమిండియాదే గెలుపువరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 రన్స్ టార్గెట్ ను ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ లోనే ఓపెనర్ బ్రెండన్ కింగ్ (4) ఔటయ్యాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ( 31 ) పర్వాలేదనిపించాడు.

టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్ తో వెస్టిండీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించింది. దీంతో రోస్టన్ ఛేజ్ (4) రోమన్ పావెల్ (2), అకీల్ హోసీన్ (10), ఒడియన్ స్మిత్ (4) ఏ మాత్రం రాణించలేకపోయారు. నికోలస్ పూరన్ (61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 157 రన్స్ చేయగల్గింది.

ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన టీమిండియా శుభారంభం చేసింది. రోహిత్ శర్మ (40), ఇషాన్ కిషన్ (35) రాణించారు. విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (8) ఆకట్టుకోలేకపోయారు. కానీ సూర్యకుమార్ యాదవ్ (34), వెంకటేశ్ అయ్యర్ (24) నిలకడగా ఆడుతూ టీమిండియా సక్సెస్ వైపు చేర్చారు. దీంతో ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించారు.