బుర్రిపాలెం బుల్లోడి అస్తమయం

బుర్రిపాలెం బుల్లోడి అస్తమయం

బుర్రిపాలెం బుల్లోడి అస్తమయం

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు.