గాంధీలో పేషంట్లతో హరీశ్ రావు ముచ్చట

గాంధీలో పేషంట్లతో హరీశ్ రావు ముచ్చటహైదరాబాద్ : ఆరోగ్య శాఖ మత్రి హరీష్ రావు గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ప్రారంభించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్ ను మంత్రి హరీష్ రావు సందర్శించారు. పలు విభాగాల్లోని పేషంట్ల వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని ప్రతీ వార్డు తిరిగి, వసతులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

ఆస్పత్రిలో వైద్యం తీరును, వసతుల సౌకర్యంపై వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స లో వినియోగించేందుకు నెఫ్రాలజీ విభాగంలో ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వైద్య విద్యార్థులు కోరారు. దీనికి మంత్రి స్పందించి నెఫ్రాలజీ విభాగంలో ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి విలువైన వైద్య పరికరాలు సమకూర్చుతుందని, పేదలకు వాటి సేవలు అందేలా చూడాలని మంత్రి హరీష్ రావు వైద్యులను కోరారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే రిపేర్ చేయించి, పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం అన్ని విభాగాల హెచ్ ఓడి లతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, అభివృద్ధి పనులు, కరోనా చికిత్స తదితర అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.నిర్వహించారు.