డా.ప్రీతి ఫ్యామిలీకి మంత్రుల పరామర్శ
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించి, ఓదార్చారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు.ప్రీతి మృతి అత్యంత బాధాకరమన్నారు మంత్రులు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరుగకుండా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. దోషులు ఎవరైనా సరే వదిలేది లేదని , వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రీతి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ప్రతీ సమాచారాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రీతి ఆత్మహత్యపై సీఎం కేసీఆర్, కేటీఆర్ లు కూడా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రీతి సోదరుడు లేదా సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.