90టీస్ బ్యాక్ డ్రాప్ లో సప్తగిరి చిత్రం !!!

సప్తగిరి హీరోగా పునీత్ స్టూడియోస్ బ్యానర్ లో నూతన చిత్రం ప్రారంభం90టీస్ బ్యాక్ డ్రాప్ లో సప్తగిరి చిత్రం !!!వరంగల్ టైమ్స్ , సినిమా డెస్క్ : సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ అస్ట్రాలజీయర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టడం జరిగింది.

సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. Ggvk చిరంజీవి (గోపి) ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

ఫిబ్రవరి 21 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. 90టీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని చిత్ర దర్శకుడు సురేష్ కోడూరి తెలిపారు.