వరంగల్ టైమ్స్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ నెల 12న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
Home News