నాటుకోడి కూర, బగారా వండిన కేటీఆర్

నాటుకోడి కూర, బగారా వండిన కేటీఆర్నాటుకోడి కూర, బగారా వండిన కేటీఆర్

వరంగల్ టైమ్స్,జగిత్యాల జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన ‘మై విలేజ్ షో’బృందం సభ్యులు గంగవ్వ, అంజి, అనిల్, చందుతో కలిసి ఇటీవల హైదరాబాద్ శివారులో నాటుకోటి కూర,బగారా అన్నం వండి భోజనం చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ ‘మై విలేజ్ షో’బృందం సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే అభివృద్ధి పనుల గురించి చర్చించారు. గంగవ్వతో ఎవరూ పోటీ పడలేరని, పోటీ పడేది మంత్రి మల్లారెడ్డి ఒక్కరేనంటూ చమత్కరించారు.

లంబాడిపల్లె గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చడంతో పాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామాన్య మహిళ గంగవ్వ జీవితకథ గురించి తెలుసుకుని ప్రశంసించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు సన్నబియ్యం పండించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఉన్నత విద్య చదివిన యువత స్వయం ఉపాధి మార్గాల్లోనూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రేక్షకాదరణ పొందిన ‘మై విలేజ్ షో’టీం ను కేటీఆర్ అభినందించారు.