జడేజా కెరీర్ లో బెస్ట్ ఇదే!

జడేజా కెరీర్ లో బెస్ట్ ఇదే!జడేజా కెరీర్ లో బెస్ట్ ఇదే!

 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఢిల్లీ వేదికగా అత్యుత్తమ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జడేజా ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో కూడా దుమ్మురేపాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో జడేజా చెలరేగాడు. కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టిన జడేజా తన టెస్టు కెరీర్ లో బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు.

2016 లో చెన్నై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో జడేజా 48 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్ తో జడ్డూ తన గత బెస్టును అధిగమించాడు. ఇక ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా జడేజా రాణించాడు. 3 వికెట్లతో పాటు, బ్యాటింగ్ లో కూడా 26 రన్స్ చేశాడు.

మొత్తంగా చూసుకుంటే ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి జడేజా 10 వికెట్లు పడగొట్టారు. కాగా రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ కు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. జడేజాతో పాటు అశ్విన్ కూడా 3 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మిగిలిన ఒక్క పరుగు ఆధిక్యంతో కలిపి ఇండియా ముందు కేవలం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.