వాట్సాప్ లో పలు కొత్త ఫీచర్లు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనున్నట్టు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ఇప్పటిదాకా గ్రూప్ వాయిస్ కాల్లో 8 మందే పాల్గొనే అవకాశం ఉండగా.. ఆ పరిమితిని 32కు పెంచుతు న్నట్టు వెల్లడించింది. అలాగే.. ఫైల్ షేరింగ్ పరిమితిని 2 జీబీకి పెంచుతు న్నట్టు పేర్కొంది. గ్రూపు సందేశాల్లో ఏవైనా అభ్యంతరకరంగా ఉన్నట్టు అని పిస్తే వాటిని ఎప్పుడైనా తొలగించే అవకాశాన్ని అడ్మిన్లకు కల్పించనున్నట్టు వాట్సాప్ అధికార ప్రతినిధి వెల్లడించారు.