వివాహ బంధంతో ఒక్కటైన రణ్ బీర్-ఆలియా 

వివాహ బంధంతో ఒక్కటైన రణ్ బీర్-ఆలియా

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : బాలీవుడ్ లవ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని రణ్ బీర్ కపూర్ నివాసం వాస్తులో పెళ్లి తంతు జరిగింది. వీరి వివాహానికి నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోని రజ్ధాన్, షాహీన్ భట్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. వాస్తు అపార్ట్మెంట్ లో ఆలియాకు కూడా ఫ్లాట్ ఉంది. రణ్ బీర్ ఆలియా పెళ్లి నేపథ్యంలో ఏప్రిల్ 12న అపార్ట్మెంట్ ను లైట్లలో అలంకరించారు.వివాహ బంధంతో ఒక్కటైన రణ్ బీర్-ఆలియా 2018 నుంచి ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు ప్రేమలో ఉన్నారు. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం రెండు రిసెప్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16, 17 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న రిసెప్షన్ పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలైన షారూఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.