10 లక్షలకు చేరిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్

10 లక్షలకు చేరిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్వరంగల్ టైమ్స్,హైదరాబాద్: రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సామాజిక మార్పునకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబద్దిదారులు 10 లక్షలకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.

దేశంలోనే మొదటి సారిగా 2014లో ప్రారంభమైన ఈ రెండు పథకాల ద్వారా నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఈ ఆర్థిక సాయంతో తల్లిదండ్రులు అప్పులు చేసి పెళ్లిళ్లు చేసే స్థితి నుంచి ఆనందంగా పెళ్లిళ్లు చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.