ఖైదీలకు కరోనా అటాక్.. అలర్టైన జైలు అధికారులు

ఖైదీలకు కరోనా అటాక్.. అలర్టైన జైలు అధికారులున్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. తీహార్ జైల్లో 16 మంది ఖైదీలకు, 21 మంది సిబ్బందికి, మండోలి జైల్లో ఐదుగురు ఖైదీలకు, ఇద్దరు సిబ్బందికి, రోహిణి జైల్లో ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా బారిన పడిన ఖైదీలను, సిబ్బందిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

భారత్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ఒమిక్రాన్ వ్యాప్తితో జనవరి నెలాఖరులో కొవిడ్ -19 తదుపరి వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి భారత్ తో రోజూ 4 నుంచి 8 లక్షల కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.

ఇక థర్డ్ వేవ్ మార్చి నాటికి పూర్తిగా సమసిపోతుందని అంచనా వేశారు. జనవరి మధ్యలో ఢిల్లీ, ముంబైలో ఒమిక్రాన్ వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని ఈ రెండు సిటీల్లో అప్పటికే రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతాయని వెల్లడించారు. కఠిన లాడ్ డౌన్ ల ద్వారా ఈ వేవ్ లను నియంత్రించవచ్చని అది మహమ్మారి కొనసాగేందుకు దోహదపడుతుందని అన్నారు. లాక్ డౌన్ విధించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారాన్ని నివారించవచ్చని చెప్పారు.