భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం

సమ్మక్క తల్లి ఆగమనంతో మొదలైన మేడారం మహా జాతర
తండోపతండాలుగా తరలివస్తున్న భక్తజన సందోహం
ప్రభుత్వ లాంఛనాలు, ఆదివాసీల సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికిన మంత్రులువరంగల్భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం

టైమ్స్, ములుగు జిల్లా: మేడారం మహా జాతరలో మహా ఘట్టం మొదలైంది. నిన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై ఆసీనులు కాగా, నేడు చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. తమ సంప్రదాయ పద్దతిలో ఆలయ పూజారులు పసుపు కుంకుమ రూపంలో ఉన్న

( కుంకుమ భరిణె) సమ్మక్క అమ్మ వారిని తీసుకొని బయలుదేరారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపి, ప్రభుత్వ లాంఛనాల మధ్య అమ్మవారి రాకకు నాంది పలికారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , దేవాదాయ ధర్మాదాయ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లు సమ్మక్క తల్లికి ఘన స్వాగతం పలికారు.భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనంఇక అక్కడి నుండి ఊరేగింపుగా లక్షలాది మంది భక్తులు అమ్మ వారికి కేరింతలతో, సమ్మక్క తల్లికి జై అనే నినాదాలతో స్వాగతం పలికారు. అమ్మ వారిని తీసుకువస్తుండగా పూజారులు కాళ్ళకు అడ్డం పడితే పుణ్యం దక్కుతుందన్న నమ్మకంతో అనేక మంది భక్తులు దారిపొడవునా అమ్మవారి రాకకు అడ్డం పడుతున్నారు. అలాంటి వాళ్ళను పక్కకు జరుపుతూ, రోప్ పార్టీ, పోలీసులు భారీ బందోబస్తు మధ్య సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకువచ్చారు. కాగా, అటు చిలకల గుట్ట నుండి గద్దెల వరకు, మరోవైపు మేడారం చుట్టూ పరిసర ప్రాంతాల్లో సుమారు 50 కి. మీ మేర అడవంతా జన సంద్రమై భక్తి పారవశ్యంతో అమ్మవారి నామ స్మరణతో పులకించిపోయింది.