కొంపముంచిన మేకప్ 

కొంపముంచిన మేకప్

కొంపముంచిన మేకప్ వరంగల్ టైమ్స్, బెంగళూరు : ఆడవాళ్లకి అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలన్న ఆశ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే అందులోనూ పెళ్లికావాల్సిన అమ్మాయిలకు ఇంకా ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఇంట్లో ఉండే పసుపు, శనగపిండి, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో ఒంటి నిండా నలుగు పెట్టుకుని సహజమైన అందంతో ఉట్టిపడేవారు.

*ట్రెండ్ మారింది..
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతీ అమ్మాయి బ్యూటీ పార్లర్ వైపు పరుగులు తీస్తూనే ఉంది. ఇలాగే ఓ నవ వధువు రెండ్రోజుల్లో తన పెళ్లి ఉందనగా స్థానికంగా ఉన్న బ్యూటీపార్లర్ కు వెళ్లింది. ఆమె ఫేషియల్ చేయించుకుంది. అయితే అది కాస్త బెడిసికొట్టింది. ఫేస్ మాస్క్ వికటించి అందంగా కనిపించాల్సిన ముఖం కాస్త వాచిపోయి నల్లగా మారింది. ఇంకేముంది. ఈ దెబ్బతో పెళ్లి జరగాల్సిన సమయానికి జరుగలేదు. పైగా వరుడు ఈ పెళ్లిని వాయిదా వేశాడు.

*వికటించిన ఫేషియల్..రద్దైన పెళ్లి
వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఆరాసికేర్ గ్రామానికి ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తైంది. మరో రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుంది. దీంతో తాను మరింత అందంగా కనిపించాలనుకున్న ఆమె తన ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటీపార్లర్ కు వెళ్లింది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని బ్యూటీషియన్ కు చెప్పింది. దీంతో బ్యూటీషియన్ ఆ కాబోయే వధువు మొహానికి ఏదో ఫౌండేషన్ అప్లయ్ చేసింది. అనంతరం స్టీమ్ చేయడంతో ముఖం వాచిపోయింది. దీంతో చర్మం నల్లబడిపోయి, ముఖం మొత్తం వాపువచ్చింది. అది చూసిన పెళ్లికొడుకు వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

*బ్యూటీపార్లర్ యాజమాన్యంకు సమన్లు జారీ
అయితే దీనంతటికీ కారణమైన బ్యూటీపార్లర్ యజమాని గంగపై, అందులో పనిచేస్తున్న బ్యూటీషియన్ పై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారికి సమన్లు జారీ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.