భేటీ ఐన మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు

భేటీ ఐన మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలువరంగల్ టైమ్స్, ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు తెలంగాణ సీఎం కేసీఆర్ తన బృందంతో ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తున్నారు. భేటీ ఐన మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలుఈ సమావేశం ముగిసిన అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కేసీఆర్ కలువనున్నారు. తిరిగి సాయంత్రం 7.20గంటలకు సీఎం కేసీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ కు రానున్నారు. సీఎం వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.