మహనీయుని పేరును పట్టించుకోని బీజేపీ : చల్లా

మహనీయుని పేరును పట్టించుకోని బీజేపీ : చల్లా

మహనీయుని పేరును పట్టించుకోని బీజేపీ : చల్లావరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దేశంలోని ప్రతీ ఒక్కరు అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం పరకాల నియోజకవర్గంలోని దామెర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దేశమంతా విజ్ఞప్తి చేసినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే చల్లా విమర్శించారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించడం దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇది దేశంలోని అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలవనుందని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారి ఆశయాలకు అనుకూలంగా నేడు రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నదని అన్నారు. దళితులను అన్నివిధాలుగా ఆర్ధికంగా బలోపేతం చేయాలనే దళితబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.