మీడియాకు సారీ చెప్పిన యాంకర్ సుమ

మీడియాకు సారీ చెప్పిన యాంకర్ సుమమీడియాకు సారీ చెప్పిన యాంకర్ సుమ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులను తన మాటలతో ఇట్టే కట్టిపడేసే యాంకర్ సుమ మీడియాను క్షమాపణలు కోరింది. సుమ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో గడగడా మాట్లాడేస్తుంది. ఏ సినిమా ఈవెంట్ అయినా, ఏ షో అయినా వ్యాఖ్యాతగా సుమ ఉండాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమ తాజాగా మీడియాను క్షమాపణలు కోరింది. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకను సినిమా యూనిట్ హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కు సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మీడియాపై సుమ నోరు పారేసుకున్నారు.

‘మీడియా వారు స్నాక్స్ ను భోజనంగా తింటున్నారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ సీరియస్ గా తీసుకున్నారు. మీడియా వారిని అలా అనకుండా ఉండాల్సింది అని సుమ ఎదురుగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ జర్నలిస్ట్. దీంతో సుమ స్పందిస్తూ ‘మీడియా వారంతా నాతో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నారు.ఆ చనువుతోనే అలా అన్నాను’ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత ‘మీరు స్నాక్స్ ను స్నాక్స్ లానే తిన్నారు..ఓకేనా’ అంటూ సదరు జర్నలిస్ట్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో అతను మరోసారి అసహనానికి గురయ్యారు.’ఇదే వద్దనేది.. మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే. మాకు కూడా ఇష్టమే. అయితే మీడియా విషయంలో ఇలాంటివి వద్దూ’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. వెంటనే సుమ అక్కడే జర్నలిస్టులకు సారీ చెప్పారు. అనంతరం మీడియా మిత్రులకు క్షమాపణలు కోరుతూ సుమా తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.