పరిశుభ్రతే ఆరోగ్యాన్ని కాపాడుతుంది : చీఫ్ విప్

వరంగల్ అర్బన్ జిల్లా: ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వుండేందుకు ప్రతీ ఆదివారం 10గంటలకు 10నిమిషాలు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే హన్మకొండ బాలసముద్రంలోని తెలంగాణ పిండివంటలు ఆవరణలో చీఫ్ విప్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. తెలంగాణ పిండివంటలు ఆవరణలో పాడుబడిన చెత్త కుండలను , తడి చెత్తను మరియు మురికి నీటి గుంటలను దాస్యం వినయ్ భాస్కర్ శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఇంటి ఆవరణలో శుభ్రం చేసుకోవాలని వరంగల్ నగర మరియు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు.