షార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞ

షార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞషార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞ

– విజయవంతంగా షార్ప్ కిడ్స్ అబాకస్ రాష్ట్ర స్థాయి పోటీలు
– రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి విజేత రసజ్ఞ
– విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : షార్ప్ కిడ్స్ అబాకస్ రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం ఉదయం వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో నిర్వహించారు. అనంతరం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సందర్భంగా అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వరంగల్ బట్టల బజార్ షార్ప్ కిడ్స్ బ్రాంచ్ కు చెందిన 8వ లెవెల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని దివ్వెల రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. అతిథుల చేతుల మీదుగా మెడల్, షీల్డు అందుకున్న రసజ్ఞను టీచర్ నళినితో పాటు తల్లిదండ్రులు నిర్మల, పూర్ణచందర్, నానమ్మ కుసుమలత, తోటి విద్యార్థులు అభినందించారు.షార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞమొత్తం మూడేళ్ళలో అన్ని లెవెళ్లు పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సాధించిన 142 మంది విద్యార్థులకు గ్రాండ్ మాస్టర్ సర్టిఫికెట్లతో పాటు షీల్డులు బహుకరించారు. అదే విధంగా 13 లెవెల్స్ పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా ఛాంపియన్ కప్స్ అందచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా షార్ప్ అబాకస్ డైరెక్టర్ సరిత సునిల్, కెఎంసి ఫిజికల్ డైరెక్టర్ తుమ్మ ప్రభాకర్ రెడ్డి, వరంగల్ ఫ్రాంచైజ్ గార్లపాడ్ శాంతి గురురాజ్, టీచర్లు నళిని, ప్రణీత, జగన్, రాము, తేజస్వి, రవిశంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.