35 ఏళ్ల తర్వాత గర్భం వస్తే ఎదురయ్యే సమస్యలు

35 ఏళ్ల తర్వాత గర్భం వస్తే ఎదురయ్యే సమస్యలు

35 ఏళ్ల తర్వాత గర్భం వస్తే ఎదురయ్యే సమస్యలువరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రతి జంట ఎంత తొందరగా పిల్లలు పుడితే అంతమంచిదని భావిస్తుంటారు. నిజానికి ఈరోజుల్లో చాలా మంది మూడు పదులు నిండనిదే పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. 30 తర్వాత పెళ్లి చేసుకున్నా, అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు. నిజానికి పిల్లల్ని సరైన సమయంలో కంటేనే అది తల్లిదండ్రులకు మంచిది. లేదంటే పిల్లలకు, తల్లులకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

జీవనశైలిలో మార్పులు వల్ల మనదేశంలో సంతానోత్పత్తి రేటు ప్రతిఏడాది ఒకశాతం తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే 35ఏళ్ల తర్వాత సంతానం కలిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాని నిపుణులు అంటున్నారు. ఈ వయస్సులో ఆడవారు గర్భందాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ గర్భం దాల్చిన కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఆ సమస్యలేంటో ఓసారి చూద్దాం.

* డయాబెటిస్ :
ఇది గర్భాధారణ సమయంలో వస్తుంది. శరీరం తగినంత మొత్తంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేనప్పుడు గర్భదారణ డయాబెటిస్ వస్తుంది. వయస్సుతోపాటు ఊబకాయం, జీవశైలి, కుటుంబంలో మధుమేహం చరిత్ర వంటి అంశాలు కూడా డయాబెటిస్ ను ప్రభావితం చేస్తాయి. గర్భధారణ సమయంలో డయాబెటిస్ వస్తే పిల్లలు మీర ఎక్కువ బరువు పుట్టే ఛాన్స్ ఉంటుంది.

* అధిక రక్తపోటు :
సాధారణంగా రక్తపోటు అనేది వృద్ధులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మహిళలు 35ఏళ్లుదాటిన తర్వాత గర్భవతి అయినప్పుడు.. వారికి ఇంతకు ముందు రక్తపోటు లేనప్పటికీ అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక రక్తపోటు పిండం పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

* పోస్ట్-డేటెడ్ గర్భం :
వయస్సు పెరిగేకొద్దీ postdatism ప్రమాదం (42 వారాలకు మించి) అనేది పెరుగుతుంది. పోస్ట్ డాటిజంలో మహిళలకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో బిడ్డ సరైన సమయానికి బయటకి రాకపోవచ్చు.దీంతో సిజేరియన్ చేయాల్సి వస్తుంది.

* పెరిగిన సి-సెక్షన్ డెలివరీ :
సి సెక్షన్ డెలివరీనే సిజేరియన్ డెలివరీ అని పిలుస్తారు. ఈ మధ్యకాలంలో రక్తపోటు, జిడిఎం, మావి ప్రీవియా, పోస్ట్డాటిజం వంటి ప్రమాదకాలను తొలగించడానికి చాలా మందికి సెజేరియన్ డెలివరీలే చేస్తున్నారు.

* గర్భస్రావం అయ్యే అవకాశాలు :
వయస్సు పెరిగేకొద్దీ గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే చాలాసార్లు ఈ గర్భస్రావం క్రోమోజోమల్ అసాధారణతల వల్ల కూడా జరుగుతుంది.

ఏదేమైనా పిల్లలను కనడానికి ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం, ఇంటి ఆర్థిక పరిస్థితులు, సమయం, వయస్సుతో పాటుగా మరెన్నో కారణాలు గర్భధారణను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలను కుటుంబ సభ్యుల ఒత్తిడితో అస్సలు తీసుకోకూడదు. గర్భానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, ఇతర కారకాలను అర్థం చేసుకోవడానికి వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. సరైన ఆహారం, వ్యాయామ అలవాట్లు, వ్యాధుల ముందస్తు నిర్ధారణ, మెరుగైన జీవనశైలి అనేవి గర్భధారణకు చాలా అవసరం. ముఖ్యంగా వయసు. సరైన వయసులో గర్భం దాల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.