బ్యాంకర్లు వీధి వ్యాపారులకు సహకరించాలి : కలెక్టర్ ఎస్. క్రిష్ణఆదిత్య

ములుగు జిల్లా: బ్యాంకర్లు ఋణాల అందజేతకు సహకరించాలని ములుగుజిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం ములుగు కలెక్టర్ కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, అధికారులతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ క్రింద కలెక్టర్ ఎస్ . క్రిష్ణ ఆదిత్య ప్రత్యేక డిసిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్రో ఋణాల క్రింద వీధి వ్యాపారులకు ఋణాలందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజ్, కోవిడ్ ఋణాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వానాకాలం పంటలకు సంబంధించి పంట ఋణాలు అందించాలన్నారు. అటల్ పెన్షన్ యోజన క్రింద అన్ని బ్యాంకులు తమ బ్యాంకర్లు వీధి వ్యాపారులకు సహకరించాలి : కలెక్టర్ ఎస్. క్రిష్ణఆదిత్యలక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. మొదటి విడత రుణమాఫీ క్రింద రూ. 25 వేల రుణం లోపు వున్న 3 వేల 442 మందికి ఇప్పటి వరకు 4 కోట్ల 71 లక్షల 39 వేల రూపాయలు వివిధ బ్యాంకుల్లో జమ అయినట్లు కలెక్టర్ తెలిపారు. డెయిరీ, మత్స్య రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు క్రింద నమోదు చేయించాలని తెలిపారు. ఫిబ్రవరి 29 వరకు ఉన్న స్టాండర్డ్ ఎం.ఎస్.ఎం.ఇ. అకౌంట్ లో 20 శాతం ఋణాలకు, 10 శాతం పంట ఋణాలకు నెల రోజుల లోపు విడుదల చేయాలని తెలిపారు . కోవిడ్ దృష్ట్యా అన్ని వర్గాల వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, త్వరితగతిన ఋణాలు అందించి ఆదుకోవాలని కలెక్టర్ బ్యాంకుల అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎల్డిఎం ఆంజనేయులు, డిఆర్డీవో ఏ. పారిజాతం, ఇ.డి. ఎస్సి కార్పొరేషన్ తుల రవి, జిఎం ఇండస్ట్రీస్ సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్, జిల్లా పశు సంవర్థక అధికారి విజయ భాస్కర్, ఏపిడి శ్రీనివాస్, స్త్రీ నిధి ఆర్ఎం అరుణ్ సింగ్, జిల్లా మత్స్య శాఖాధికారి వీరన్న, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.