ఓరుగల్లులో ముగ్గురు సిట్టింగులకు మొండిచేయి ? 

ఓరుగల్లులో ముగ్గురు సిట్టింగులకు మొండిచేయి ?

ఓరుగల్లులో ముగ్గురు సిట్టింగులకు మొండిచేయి ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణ భవన్ లో ఇటీవల బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో దళితబంధు విషయంలో కొంతమంది నిధులు దుర్వినియోగం చేసినట్లు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందట. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని విస్తృతస్థాయి మీటింగ్ లో సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారట. అంటే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొందరి సీట్లు కట్ అనే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారన్న మాట. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి ఓరుగల్లులో అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు మిస్ అయ్యే అవకాశం ఎవరికి ఉందా ? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

* కేసీఆర్ దగ్గర ఆ ముగ్గురి చిట్టా !
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీటు మిస్ అయ్యే నాయకుల లిస్టులో మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు ఈ లిస్టులో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దళిత సామాజికవర్గం నుంచి కూడా ఓ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఉన్నట్లు సమాచారం. ఇక ఓసీ కమ్యూనిటీ నుంచి ఓ ఎమ్మెల్యే పేరు కూడా లిస్టులో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా మూడు సామాజికవర్గాల వర్గాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు హిట్ లిస్టులో ఉన్నట్లు టాక్. ఈ ముగ్గురూ గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన వారేనట. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. రెండు సీట్లున్న బీజేపీ ప్రస్తుతం దేశాన్ని శాసిస్తోంది. కాబట్టి గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచినవారు కూడా ఈసారి మళ్లీ గెలుస్తారన్న గ్యారెంటీ అయితే లేదు. అందుకే ఈ ముగ్గురూ తీవ్ర వ్యతిరేకను మూటగట్టుకుని, నిస్తేజంగా మారిపోయారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

* దందాలు, పైరవీలే కొంపముంచాయా ?
ఉమ్మడి ఓరుగల్లు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ టికెట్ దక్కడం అనుమానమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దగ్గర ఈ ముగ్గురి చిట్టా ఉందట. వాస్తవానికి సీఎం కేసీఆర్ చెప్పినట్లు దళితబంధు ఒక్కటే కాదు, దందాలు, పైరవీలు, కాంట్రాక్టుల్లోనూ ఈ ఎమ్మెల్యేలు తలదూర్చి కమీషన్లు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. బీఆర్ఎస్ పెద్దలు ఎంత చెప్పినప్పటికీ వారు తీరు మార్చుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించినప్పుడు ఈ ముగ్గురిపైనా ఓ క్లారిటీ వచ్చేసిందట. మంత్రి కేటీఆర్ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించినట్లు టాక్. ఫీడ్ బ్యాక్ అంతా తీసుకుని సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

* ముగ్గురి విషయంలో ఫుల్ క్లారిటీతో హైకమాండ్ !
సీఎం కేసీఆర్ అన్నీ ఆలోచించే తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వరంగల్ ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ మాటలతో ఆ ముగ్గురికీ క్లారిటీ వచ్చేసినట్లు కూడా టాక్. వాళ్ల స్థానంలో కొత్త నాయకులను రంగంలోకి దించేందుకు మంత్రి కేటీఆర్ ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి మధ్య సీరియస్ గా చర్చ కూడా జరిగిందట. పేర్లు బయటకు రాలేదు కానీ ఆ మూడు స్థానాల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై బీఆర్ఎస్ హైకమాండ్ కు ఫుల్ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఓరుగల్లులో సీటు కోల్పోయే ఆ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఇప్పుడు చర్చ అయితే జోరుగా సాగుతోంది. కొన్ని పేర్లు బయటకు వినిపిస్తున్నా, అయితే అందులో వాస్తవమేంటో ఎవరికీ క్లారిటీ లేదు. మరి ఓరుగల్లులో నిజంగానే సీఎం కేసీఆర్ ముగ్గురి టికెట్లను కట్ చేసేందుకు సిద్ధపడతారా ? లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా ? అలాకాకుండా ముగ్గురు కొత్త ముఖాలకు చోటిస్తారా ? ఒకవేళ ఇస్తే పరిస్థితి వాళ్ల ఏంటన్నది? ఇప్పుడప్పుడే అంచనా వేయడం మాత్రం కష్టమే.