నర్సుల అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

•నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
•ఈ నెల 15 లోపు నామినేషన్లను అందజేయాలి
•ఎంపికైన వారికి రూ. 50 వేల నగదుతో సర్టిఫికేట్, పతకం బహుకరణ
•రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావునర్సుల అవార్డులకు నామినేషన్ల ఆహ్వానంవరంగల్ టైమ్స్ ,అమరావతి: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులు-2022 బహుకరణకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు క్రింద రూ. 50,000/- నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్ మరియు పతకాన్ని బహుకరించడం జరుగుతుందన్నారు. సహాయక నర్సులు, మంత్రసాని, రిజిస్టర్డ్ నర్సులు మరియు మిడ్‌వైఫ్ & రిజిస్టర్డ్ లేడీ హెల్త్ విజిటర్స్ ఈ నామినేషన్స్ కు అర్హులని తెలిపారు.

ఔత్సాహికులు అంతా తమ నామినేషన్లను రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయం, పాత గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ క్యాంపస్, విజయవాడ వారికి ఈ నెల 15 లోపు అందేలా పంపిచాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రమాణాలు, దరఖాస్తు ఫారమ్, నామినీ యొక్క రెజ్యూమ్‌ను సిద్ధం చేసే సంస్థలు, రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ కూర్పు మరియు అవార్డు కోసం నామినీల ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు www.indiannursingcouncil.orgలో అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు.