రైల్వేలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్ల కొనుగోలు

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ద.మ.రైల్వేలో టికెట్లు కొనుగోలు చేసే వెసులుబాటు
‘అటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్‌ ద్వారా అన్‌ రిజర్వ్ డ్‌ టికెట్లు
మరింత సులభంగా పొందేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యం ఏర్పాటు
‘ప్రస్తుత స్మార్ట్‌ కార్డు వినియోగం సౌకర్యానికి అదనంగా కూర్పులు
పేటీఎమ్‌ మరియు ఫ్రీచార్జ్‌ పేమెంట్‌ గేట్‌వేస్‌ తోడ్పాటుతో టికెట్లు పొందే వసతిరైల్వేలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్ల కొనుగోలువరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దక్షిణ మధ్య రైల్వేలో మరింతగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించేందుకు మరియు డిజిటల్‌ చెల్లింపులను పెంచడంలో భాగంగా ఇప్పుడున్న వసతులకు అదనంగా వినూత్న ఏర్పాట్లకు పూనుకుంది. ప్రయాణికులు ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్స్‌ (ఎటివిఎమ్‌లు) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ ద్వారా టికెట్‌ చార్జీ చెల్లించే అవకాశాన్ని కల్పించారు.

ఈ నూతన సౌకర్య విధానంలో ఎటివిఎమ్‌లో ప్రయాణ వివరాలు నమోదు చేశాక టికెట్‌ చార్జీ చెల్లింపుకు ప్రస్తుత ఆప్షన్లకు అదనంగా పేటీఎమ్‌ ద్వారా యూపిఐ మరియు ఫ్రీచార్జి ద్వారా యూపిఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపుకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలక్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం ప్రయాణికులకు ఎటివిఎమ్‌ స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. దీనిని స్కాన్‌ చేసి ప్రయాణికులు టికెట్‌ చార్జీ చెల్లించవచ్చు.. పేమెంట్‌ చెల్లింపు విజయవంతంగా పూర్తి అయిన తర్వాత నిర్ణీత టికెట్‌ మెషిన్‌ ద్వారా లభిస్తుందని తెలిపారు.

అన్‌రిజర్వడ్‌ టికెట్లు మరియు ప్లాట్‌ఫారం టికెట్లు కొనుగులు చేసే రైలు వినియోగదారులకు ఎటివిఎమ్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ మెషిన్ల ద్వారా టికెట్లు పొందాలనకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు ఖచ్ఛితంగా స్మార్ట్‌ కార్డులు కల్గి ఉండాల్సి వచ్చేది మరియు అవసరమైనప్పుడల్లా వాటిని రీచార్జి చేసుకోవాల్సి వచ్చేది. ఈ స్మార్ట్‌ కార్డులను జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్‌ పద్ధతిలో రిచార్జీ చేసుకోవచ్చు. పై సౌకర్యానికి అదనంగా స్మార్ట్‌ కార్డులు లేని రైలు వినియోగదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు మరియు సులభమైన విధానంలో డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు గేట్‌వేస్‌ (పేటీఎమ్‌ లేదా ఫ్రీచార్జి) చెల్లింపులను వినియోగించుకొని ఎటివిఎమ్‌లపై కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేయడం ద్వారా టికెట్లు కొనుగోలు చేసేందుకు అదనపు అవకాశాలను దక్షిణ మధ్య రైల్వే కల్పించింది.

జనరల్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద క్యూలైన్లను మరియు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ రైలు వినియోగదారులకు సూచించారు. ప్రస్తుత కొవిడ్‌ మహమ్మారి సమయంలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఎంతో తోడ్పడుతుందని ఆయన అన్నారు.