భద్రకాళి సన్నిధిలో ప్రముఖ నటుడు సుమన్

భద్రకాళి సన్నిధిలో ప్రముఖ నటుడు సుమన్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ తెలుగు సినీ నిర్మాత పిడివి ప్రసాద్ సందర్శించారు. భద్రకాళి సన్నిధిలో ప్రముఖ నటుడు సుమన్పూజానంతరం ప్రముఖులకు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహుకరించారు. తర్వాత ఆలయ ఈవో శేషు భారతి వారికి ప్రసాదములు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త తొనుపునూరి వీరన్న , దేవాలయ సిబ్బంది, తదితరులున్నారు.