అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్ 

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : హైదరాబాద్ లో అంతర్జాతీయ డగ్స్ ముఠా గుట్టురట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 9 కోట్లు ఉంటుందని తెల్పారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని రాచకొండ పోలీసులు వెల్లడించారు.