తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్ చరణ్

తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్ చరణ్

తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్ చరణ్

 

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సినీ హీరో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తండ్రి , మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. “హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్ చరణ్ లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఉపాసన-రామ్ చరణ్ లకు 2012 జూన్ 14న మ్యారేజ్ అయింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఐతే చెన్నైలో ఉండగా, 9వ తరగతి వరకు రామ్ చరణ్, ఉపాసన ఒకే స్కూల్ లో చదివారు. పెళ్లై పదేళ్లు అవుతున్నా చరణ్ దంపతులు ఎలాంటి శుభవార్త తెల్పకపోవడంతో పిల్లలెప్పుడు అంటూ అనేక సందర్భాల్లో ఉపాసనకు ప్రశ్నలు ఎదురైన విషయం అందరికీ తెలిసిందే.