కొండా ఇంట్లో వర్మ ఏం చేశాడో చూడండి !

కొండా ఇంట్లో వర్మ ఏం చేశాడో చూడండి !వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహత్యం అందరికీ తెలిసిందే. ప్రతీ రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ మహా జాతరకు గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. చారిత్రక నేపథ్యంతో పాటు, వీరత్వం పూనుకున్న వనదేవతలను దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. పైగా తెలంగాణలో మందుచుక్క, మాంసం ముద్ద లేనిదే ఫంక్షన్లు, పండుగలు జరుపుకున్నట్లు అనిపించదు.

ఇక మేడారం మహాజాతర, తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న వనదేవతలను దర్శించుకున్న అనంతరం భక్తులు మందు, విందు చేసుకోనిదే జాతర నుంచి తిరుగు ప్రయాణం చేయరు. అయితే జాతరకు వచ్చే ముందు తమ తమ ఇళ్లల్లో భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కు చెల్లించుకుని, బంగారం సమర్పించుకుని, మందు సమర్పించి, కోడి, మేక బలి ఇచ్చి విందు చేసుకుంటారు. ఆపై జాతరకు బయల్దేరుతారు. ఇదీ ఆనవాయితీ..

అయితే ఇక్కడ దేవుళ్లు, దయ్యాలు అని నమ్మని వారు సైతం వనదేవతల మహిమలకు, వారి చారిత్రక నేపథ్యానికి భక్తితో సలాం కొట్టాల్సిందే. ఇక అసలు విషయానికొస్తే దేవుళ్లు, దయ్యాలు ఈ సృష్టిలో లేవని నమ్మే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు మొక్కు సమర్పించుకున్నాడు. ఎక్కడో తెలుసా..? హనుమకొండలోని మాజీ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ఇంట్లో వారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. కొండా దంపతులు తమ ఇంట్లో సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కొండా మురళీ ఇంటికి అతిథిగా వచ్చిన రాంగోపాల్ వర్మకు ట్రీట్ గా మెక్ డాల్స్ విస్కీ ఇచ్చారు. ఆ బాటిల్ తో ఎంజాయి చేసే ముందు వర్మ సమ్మక్క -సారలమ్మ ఫోటో వద్ద విస్కీ సమర్పించి, మొక్కులు అప్పగించి ఆ విస్కీ బాటిల్ తో పండగా చేసుకున్నాడు. ఈ సందర్బాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో వర్మ షేర్ చేసుకున్నాడు.