క్రిస్టియన్స్ కి గిఫ్ట్ ప్యాక్ లు అందించిన చీఫ్ విప్

క్రిస్టియన్స్ కి గిఫ్ట్ ప్యాక్ లు అందించిన చీఫ్ విప్

హనుమకొండ జిల్లా : నిరుపేదలంరూ పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సంబంధించిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు మూడు లక్షల పై చిలుకు మంది నిరుపేదలకు నూతన వస్త్రాలను క్రిస్మస్ గిఫ్ట్ కానుకలుగా అందించిందన్నారు.

క్రిస్టియన్స్ కి గిఫ్ట్ ప్యాక్ లు అందించిన చీఫ్ విప్దాదాపు రూ.12 కోట్లతో ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లెప్రసీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబాలకు శుక్రవారం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అందచేశారు.

వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో ఇప్పటికే దాదాపు లబ్ధిదారులందరీకీ గిఫ్ట్ ప్యాక్ లు అందించినట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని చీఫ్ విప్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పులి రజనీకాంత్, స్థానిక కార్పొరేటర్ తోట వేంకటేశ్వర్లు, కూడా డైరెక్టర్ శివశంకర్, డివిజన్ అధ్యక్షుడు కలీల్, జనరల్ సెక్రటరీ ఈశ్వర్, రమాక్రిష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.