నాటి సరదాను చెప్పుకొచ్చిన బిగ్ బీ 

నాటి సరదాను చెప్పుకొచ్చిన బిగ్ బీ

నాటి సరదాను చెప్పుకొచ్చిన బిగ్ బీ 

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయన తాజాగా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర ఘటన గురించి షేర్ చేశారు. అప్పట్లో తాను బెల్‌బాటమ్ ప్యాంటు ధరించిన సందర్భంలో ప్యాంటులోకి ఓ ఎలుక దూరిందని చెప్పుకొచ్చారు. “2 2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వెళ్లాను. అయితే..సీట్లో కూర్చున్న కాసేపటికే నా ప్యాంటులో ఓ ఎలుక దూరింది” అంటూ నాటి సరదా ఘటన గురించి బిగ్ బీ చెప్పుకొచ్చారు. నవ్వుతున్న ఓ ఎమోజీని కూడా జతచేశారు.

ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ రోజుల్లో ఆయన స్టైల్ వేరే లెవెల్‌‌లో ఉండేదంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. “నాటి నుంచీ నేటి దాకా మీలో ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు” అంటూ మరికొందరు బిగ్‌ బీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. కళారంగానికి బిగ్ బీ చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.