చంద్రమోహన్ మృతి పట్ల పవన్ ఎమోషనల్

చంద్రమోహన్ మృతి పట్ల పవన్ ఎమోషనల్చంద్రమోహన్ మృతి పట్ల పవన్ ఎమోషనల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : చంద్రమోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎమోషనల్ అయ్యారు జనసేన చీఫ్,నటుడు పవన్‌ కల్యాణ్‌. చంద్ర మోహన్ కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు పవన్ కళ్యాణ్.ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేదని చెప్పారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారన్నారు.

పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. చంద్ర మోహన్‌తో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చంద్రమోహన్ చేరువయ్యారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ పవన్‌ కల్యాణ్‌ నివాళులు అర్పించారు.