విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్: దగ్గుబాటి వారింట పెళ్లి బాజా మొదలైంది.విక్టరీ వెంకటేష్-నీరజల రెండో కూతురు హవ్యవాహిని పెళ్లి పీటలెక్కనుంది. ఈ మేరకు అక్టోబర్ 25 బుధవారం రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నారని సమాచారం.ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి,సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.