త్వరలో భద్రకాళి చెరువులో బోటు షికార్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళీ చెరువులో బోటు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్టి భద్రకాళీ బండ్‌లోకి చేరుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన జెట్టి ఈ రోజు భద్రకాళి బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో 25మంది ప్రయాణించే బోటు షికారు ప్రారంభం అవుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి తెలిపారు.ఎన్నో యేళ్లుగా నగర వాసులు ఎదురుచూస్తున్న బోటు షికారు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పటికే భద్రకాళి బండ్ ను అద్భుతంగా తీర్చి దిద్దింది. ఇకపై బోటు షికారు వల్ల నగర ప్రజలకు వారాంతంలో మంచి అనుభూతి కలుగుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.