ఆ డబ్బులు తిరిగిచ్చేది లేదు

ఆ డబ్బులు తిరిగిచ్చేది లేదు

వరంగల్ టైమ్స్, బీహార్ : బీహార్ లోని ఖగరియా జిల్లాకు చెందిన వ్యక్తి అకౌంట్లో రూ.5.5లక్షలు పొరబాటు కారణంగా పడిపోయాయి. కానీ, తాను వాటిని వెనక్కు ఇచ్చేది లేదని తనకు ప్రధాని మోడీ రూ.15లక్షల్లో భాగంగా తొలి ఇన్‌స్టాల్మెంట్ పంపాడని చెప్తున్నాడు. బక్తియార్పూర్ గ్రామంలోని మన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.ఆ డబ్బులు తిరిగిచ్చేది లేదురంజిత్ దాస్ అనే వ్యక్తి పేరు మీద గ్రామీణ బ్యాంక్ లో తప్పుడు డిపాజిట్ అయింది. అవి తాను ఖర్చు పెట్టేశానని తిరిగి ఇచ్చేది లేదని చెప్పుకొస్తున్నాడు. బ్యాంక్ నుంచి ఎన్ని నోటీసులు అందినా తన నుంచి ఒకటే సమాధానం ఇస్తున్నాడు.

‘ఈ ఏడాది మార్చిలో నాకు అకౌంట్లో డబ్బులు పడగానే చాలా సంతోషంగా ఫీలయ్యా. ప్రతీ ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు పడతాయని పీఎం మోడీ చెప్పిన మాట ప్రకారం డబ్బులు వేశారనుకున్నా. ఇందులో భాగంగానే తొలి ఇన్‌స్టాల్మెంట్ డిపాజిట్ అయిందనుకున్నా.

వచ్చిన డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టేశా. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు’ అని పోలీస్ కస్టడీలో ఉన్న దాస్ చెప్తున్నాడు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు రంజిత్ దాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారి దీపక్ కుమార్ అన్నారు.