రాజధాని ఎక్కడో చెబితే కార్యాలయం పెడతాం

రాజధాని ఎక్కడో చెబితే కార్యాలయం పెడతాంఅమరావతి : రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాక తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి వీరాంజనేయులు ఆర్బీఐకి ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ సుభాశ్రీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.