ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించండి : జాస్తి

లేపాక్షి, గండికోట, నాగార్జున కొండ, అమరావతిని యునెస్కో గుర్తించాలి.
యునెస్కో ఢిల్లీ డైరెక్టర్ ఏరిక్ ఫాల్ట్ కు లేఖ పంపిన జాస్తిప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించండి : జాస్తివరంగల్ టైమ్స్, అమరావతి: శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకరాకపోవడం అనేది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలోని పురావస్తు శాఖ వారి చారిత్రక తప్పిదమని అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ)జాతీయ కార్యదర్శి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. ఇప్పటి వరకు ఏపీలోని 129 కట్టడాలలో ఒక్క దానిని కూడా యునెస్కో గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపద పైన దృష్టి సాధించలేదన్నారు. ఇటీవల రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ డాక్టర్ జీ వాణి మోహన్ కేంద్రం పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ కి రికమండ్ చేయడం శుభపరిణామమన్నారు. యునెస్కో డైరెక్టర్ 6 దేశాలకు ప్రతినిధి. మరో కొద్ది రోజులలో తాత్కాలిక జాబితా లో ఆంధ్రప్రదేశ్ లోని అపురూప చారిత్రక కట్టడాలకు యునెస్కోలో చోటు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా వెనుకబడి పోతుందని జాస్తి వీరంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించండి : జాస్తియునెస్కో వారు ఇటీవల కాకతీయుల గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా తెలుగు నేలలో తొలిసారి గుర్తించినందుకు స్వాగతిస్తున్నామన్నారు. మొత్తం భారతదేశంలో నలభై ప్రపంచ వారసత్వ కట్టడాలను ఇప్పటికి గుర్తించగా ఇది తెలుగు నేలలో మొదటిదని పేర్కొన్నారు. దక్షిణాది అంతా కలిపినా కనీసం ఐదుకు మించి ఆ జాబితాలో లేవన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వానికి తాను రాసిన లేఖలకు స్పందించి ఆంధ్రప్రదేశ్ లోని కీలమైన కట్టడాల వివరాలను యునెస్కో వారసత్వ కట్టడాల డైరెక్టర్ లుర్దు సామి కోరినప్పటికీ లేపాక్షి, గండికోట, నాగర్జునకొండ, అమరావతి వంటి కట్టడాల సమగ్ర వివరాలను ఇవ్వడంలో భారత పురావస్తు శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఏళ్ళుగా లేపాక్షి, గండికోట, నాగార్జున కొండ, శాలిహుండంను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించాల్సి ఉండగా గుర్తించలేదన్నారు.

కనీసం ఇప్పుడైన పురావస్తు శాఖావారు ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం, అతిపెద్ద ఏడు పడగల నాగేంద్రుడు, 856 స్థూపాల ఆలయం, 12 ధ్వజ స్తంభాలతో కూడిన నాట్యం మండపం, ఏ ఆధారం లేకుండా వేలడే ధ్వజస్తంభం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ, కుడ్య చిత్రాలకు నిలయమైన లేపాక్షి ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు కృషి చేయాలి. యునెస్కో నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడంగా లేపాక్షి అన్ని విధాలా అర్హత పొందగలదని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచి 2022 లోనైనా యునెస్కో లో చోటు దక్కే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.