చంఢీఘడ్ : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కరోనా బారినపడ్డారు. కరోనా టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లు ఆయన నేడు తన ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని, తనతో కాంటార్ట్ లోకి వచ్చినవాళ్లు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 79 యేళ్లు అమరీందర్ ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమరీందర్ భార్య, పాటియాల ఎంపీ ప్రణీత్ కౌర్ కూడా కొవిడ్ పరీక్షలో పాజిటిగ్ గా తేలారు.
Home News
Latest Updates
