ఐపీఎల్ లో ఎంట్రీకానున్న టాటా గ్రూప్

ఐపీఎల్ లో ఎంట్రీకానున్న టాటా గ్రూప్న్యూఢిల్లీ : వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఐపీఎల్ లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం లీగ్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో వైదొలగనుండటంతో వచ్చే రెండేండ్లకు గానూ టాటా గ్రూప్ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించనుందని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం పేర్కొన్నారు. ‘శతాబ్దకాలంగా విశ్వవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్న టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుండటం , బీసీసీఐకి, ఐపీఎల్ కు ప్రత్యేకమైన సందర్భం’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించాడు.