ప్రతీ పోలీస్ అధికారి బూస్టర్ డోస్ తీసుకోవాలి : సీపీ

ప్రతీ పోలీస్ అధికారి బూస్టర్ డోస్ తీసుకోవాలి : సీపీవరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందితో పాటు హోంగార్డ్ సిబ్బంది కూడా తప్పని సరిగా బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాలు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి బూస్టర్ డోస్ టీకా అందించేందుకు కమిషనరేట్ కార్యాలయములోని రాణి రుద్రమ దేవి సమావేశ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని సీపీ బుధవారం అధికారులతో సందర్శించారు.

ఈ సందర్భంగా సిబ్బందికి అందిస్తున్న బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీరును సీపీ తరుణ్ జోషి పరిశీలించడంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో విధులు నిర్వహించే ప్రతీ పోలీస్ అధికారి బూస్టర్ డోస్ టీకా తీసుకోనే విధంగా వివిధ విభాగాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ముఖ్యంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం స్థానిక ఆరోగ్య కేంద్రం ద్వారా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని సూచించారు.